*ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా శ్రీనివాసులురెడ్డి* వింజమూరు, ఆగష్టు 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి, వింజమూరు మరియు చాకలికొండ పంచాయితీల సమన్వయ సెక్రటరీ బంకా. శ్రీనివాసులురెడ్డి ఎంపికయ్యారు. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సంధర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారుల పేర్లును జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడం ఆవవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ యేడాది శ్రీనివాసులురెడ్డి ఉత్తమ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మండలంలోని చాకలికొండ పంచాయితీ కార్యదర్శిగా నియమింపబడిన బంకా. శ్రీనివాసులురెడ్డి విధి నిర్వహణలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్ధవంతమైన పంచాయితీ సెక్రటరీగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయనను వింజమూరు మేజర్ పంచాయితీ ఇంచార్జ్ ఇ.ఓగా కూడా ఉన్నతాధికారులు నియమించడం జరిగింది. చురుకైన స్వభావం కలిగిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి గా అదనపు విధులలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో వింజమూరులో శ్రీనివాసులురెడ్డి సేవలు పతాక శీర్షికలలో నిలిచాయి. పారిశుద్ధ్యం మెరుగుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను ముందుండి నడిపించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో పగలూ రేయీ అనే తేడా లేకుండా నిరంతర పర్యటనలు చేసి బ్లీచింగ్, హైపోక్లోరెడ్ ద్రావణాలు చల్లించి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులురెడ్డి ఉత్తమ పంచాయితీ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు గానూ విధి నిర్వహణలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, తహసిల్ధారు సుధాకర్ రావు, రక్షణ వలయాధికారి బాజిరెడ్డి తదితర మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు, సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లుకు, జర్నలిస్టులకు, వింజమూరు, చాకలికొండ గ్రామ పంచాయితీల ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020