- దళితులపై దాడులు చేస్తే.. ఏ ఒక్కర్నీ జగన్ ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ *- విశాఖ శిరోముండనం ఘటనలో 24 గంటల్లోనే నిందితుల్ని అరెస్టు చేశాం* *- ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దోషులు ఎంతటివారైనా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి* *- నూతన్ నాయుడికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు* *- నూతన్ నాయుడి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు..?* *- బాధితుడ్ని పరామర్శించేందుకు ప్రతిపక్షాలకు తీరిక లేదుకానీ, రాజకీయానికి మాత్రం ముందుంటారా..?* *- చంద్రబాబు హయాంలో దళితులకు ఏం గౌరవం ఇచ్చారో వెనక్కి తిరిగి చూసుకోవాలి* *ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..* 1. విశాఖలో సెల్ ఫోన్ దొంగలించాడన్న అనుమానంతో ఒక దళిత యువకుడ్ని చిత్రహింసలకు గురిచేసి శిరోముండనం చేసిన ఘటనలో.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని కోరుతున్నాం. దోషులు ఎవరైనా, ఎంతటివారైనా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. - ఇప్పటికే విశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా నేతృత్వంలో పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు సంబంధించి నూతన్ నాయుడు భార్యతోపాటు ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింది కేసు నమోదు చేసి, 24 గంటల్లోనే, పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో విశాఖ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2. ఈ ఘటన జరిగిన వెంటనే విశాఖ పోలీసు అధికార యంత్రాంగం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా పెద్దలు, మంత్రులు అంతా అక్కడకు వెళ్ళడం బాధితుడికి అండగా నిలిచి, భరోసా ఇవ్వడం జరిగింది. - స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్ళు కావొస్తున్నా.. ఈ నాగరికత సమాజంలో విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందిన నగరంలో.. ఇటువంటి ఘటనలు జరగటం హేయం. దళిత యువకుడు శ్రీకాంత్ పట్ల నూతన్ నాయుడు కుటుంబం వ్యవహరించిన తీరు, చిత్రహింసలకు గురిచేసిన తీరు.. సీసీ టీవీ ఫుటేజ్ విజువల్స్ లో చూస్తే... వీళ్ళు ఎంత అహంకారంతో ప్రవర్తించారో ప్రజలంతా చూశారు. -ఈ నాగరిక ప్రపంచంలో ఇలాంటి ప్రవృత్తి అసలు ఎందుకు వచ్చిందో.. ఇంత అనాగరికంగా ఆ కుటుంబం వ్యవహరించటానికి కారణాలు ఏమిటో అన్నది కూడా విచారించాల్సిన అంశం. ఇటువంటి పనులు వీళ్ళు ఇంకెన్ని చేశారో అన్నది కూడా బయటకు రావాలి. 3. దౌర్భాగ్యం ఏమిటంటే... దుర్మార్గమైన ప్రతిపక్షం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రతి అంశాన్నీ రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప.. దళిత యువకుడికి జరిగిన అన్యాయం గురించి.. మానవతా కోణంలో ఆలోచించే పరిస్థితి లేదు. - ఈ ప్రభుత్వం నేరం చేసిన వ్యక్తి ఎవరు అన్నది చూడదు. నూతన్ నాయుడు కావొచ్చు.. మరొకరు కావొచ్చు.. ఎవరైనా ఇంత ఘోరం చేసిన తర్వాత.. ఇక చట్టం నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. 4. బాధితుడ్ని పరామర్శించేందుకు ప్రతిపక్షాలకు మనసు రాలేదు లేదు కానీ.. రాజకీయం కోసం మాత్రం ముందుకు వస్తున్నారు.. - ఘటన జరిగిన రెండు రోజుల్లో ఒక్క టీడీపీ నాయకుడుగానీ, జనసేన నాయకుడు గానీ, బాధితుడు పక్షాన అక్కడకు వచ్చి న్యాయం చేయమని అడిగే పరిస్థితి లేదు. - ఎందుకంటే.. నూతన్ నాయుడుతో ఆ పార్టీలకు సంబంధం ఉండబట్టే కదా.. - గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి. నూతన్ నాయుడికి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు సంబంధం ఉందా...లేదా - 2014లో పెందుర్తిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తరఫున నూతన్ నాయుడు పోటీ చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, జనసేనకు సన్నిహితంగా ఉంటున్నారు. - అతను కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ, జనసేన పార్టీలో ఉన్నాడు తప్ప.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నూతన్ నాయుడుకి ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు. - పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ సినిమా తీస్తే.. దానికి కౌంటర్ గా నిర్మిస్తున్న పరాన్న జీవి సినిమాకు నూతన్ నాయుడే నిర్మాత. ఇవన్నీ దేనికి సంకేంతం..? ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి..? 5. తమ పబ్లిసిటీ కోసం ప్రతిపక్ష తెలుగుదేశం ఈ ఘటనను కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే.. ప్రజలంతా ఈ పార్టీలను మరిచిపోయే పరిస్థితుల్లో.. దొంగ మాటలు మాట్లాడి, అసత్యాలను చెప్పి ప్రజల్లో తమ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు. - తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగినప్పుడు.. దోషులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని ప్రకటన విడుదల చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరి ఈరోజు నూతన్ నాయుడు విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు..? 6. దీనితోపాటుగా మరొక విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మా పార్టీ సలహాదారు సోమయాజులు గారి పేరును అతను గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రస్తావించటం జరిగింది. అదికూడా సోమయాజులు గారు మరణానంతరం ప్రస్తావించాడు. దీనిని సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలు ట్రోల్ చేస్తున్నాయి. - దొంగలు దొరికిపోయినప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకుని గొప్పవారి పేర్లు చెప్పుకోవటం అలవాటుగా మారింది. అలానే నూతన్ నాయుడు మాటలను కూడా ప్రత్యర్థి పార ్టీలు ట్రోల్ చేస్తున్నాయి. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. 7. టీడీడీ వాళ్ళు నూతన్ నాయుడికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మాట్లాడటం దిగజారుడుతనం. నూతన్ నాయుడుకి- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేదు. అతను ఏనాడూ మా పార్టీలో చిన్నస్థాయి నాయకుడు కూడా కాదు. అతను ఏ కమిటీలోనూ మెంబరు కూడా కాదు. - ఈ ఘటనలో నూతన్ నాయుడు ప్రమేయం ఉన్నా.. అతన్ని కూడా అరెస్టు చేయాలనే మేం పోలీసుల్ని కోరుతున్నాం. 8. ఇటువంటి ఘోరాలు చేసిన తర్వాత అతను ఏ పార్టీ, ఏ స్థాయి, ఏ పదవిలో ఉన్నాడు అన్నది కూడా మా ప్రభుత్వం ఖాతరు చేయటం లేదు. - నిన్నగాక మొన్న కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మునూరు జయరాం గారి బంధువు మీద కూడా చర్యల తీసుకోవడం జరిగింది. 9. అదీగాక, దళితుల మీద దాడి చేస్తే.. చివరికి పోలీసులను కూడా అరెస్టు చేసి, వారి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించిన మొట్టమొదటి ప్రభుత్వం మాది. - దళితులపై దాడుల విషయంలో జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలోని ప్రభుత్వం ఎవర్నీ ఉపేక్షించదు. వారు ఎంతటి వారైనా, వారికి ఎంత పెద్ద వారితో సంబంధాలు ఉన్నా.. వదిలే ప్రసక్తే లేదు. 10. నేరం చేసిన వారిని నేరగాళ్ళగానే ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప.. వాళ్ళు గొప్పవాళ్ళా.. మా పార్టీ వాళ్ళా.. ప్రత్యర్థి పార్టీ వాళ్ళా.. అన్నది చూడదు. 11. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో పేద- ధనిక అన్న తేడానే లేదు. పేదవాళ్ళకు, ఇంతకాలం ఎవరైతే అణగదొక్కబడ్డారో, అణచివేయబడ్డారో.. ఆ వర్గాలకు అండగా ఉంటానని పాదయాత్రలో ఇచ్చిన మాటను ఈరోజు అధికారంలోకి వచ్చాక తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. 12. జగన్ గారు అధికారంలోకి రావడం వల్లే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల్లోని పేదలు ఈరోజు ప్రశాంతంగా జీవనం సాగించగలుగుతున్నారు. తలెత్తుకుని జీవించగలుగుతన్నారు. 13. దళితులపై ఈరోజు లేని ప్రేమను చూపిస్తున్న చంద్రబాబు హయాంలో దళితులకు ఎంత గౌరవం ఇచ్చారో.. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. - గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో.. అడుగడుగునా ఈ వర్గాలను అణచివేసిన పరిస్థితి. - దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారని ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడిన మాటలు చూశాం. - టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు జెర్రిపోతుల పాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేస్తే.. కనీసం బాధితులను పరామర్శించకుండా.. దోషులను పరామర్శించిన ఘనత టీడీపీది. దళిత మహిళపై దాడి జరిగే సమయంలో స్వయంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కొడుకు అక్కడే ఉన్నాడా.. లేదా... నిరూపిస్తాం అని మేం సవాల్ చేస్తే.. ఆరోజు పారిపోయారు. - అలానే ముదపాక ఎస్సీ భూములను ఏ విధంగా దోచుకోవాలని చూశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. - అంతెందుకు దళిత నాయకులకు టీడీపీలో ఏ విధంగా అవమానాలు జరిగాయో, వారే బయటకు వచ్చి చెప్పిన పరిస్థితిని చూశాం. 14. చంద్రబాబు అధికారంలో ఉండగా.. దళితుల పట్ల వ్యవహరించిన తీరు, ఆయన హయాంలో దళితులపై జరిగిన దారుణాలు, దౌర్జన్యాలు, అకృత్యాలను ప్రజలంతా చూశారు. వాటన్నింటినీ మరచిపోయి.. ఈరోజు చంద్రబాబు నాయుడు, సెల్ఫ్ ఐడెండిటీ కోసం తాపత్రయపడుతున్నారు. హైదరాబాద్ నుంచి జూమ్ రాజకీయం చేస్తున్నాడు 15. శిరోముండనం బాధితుడు శ్రీకాంత్ కు పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం. పార్టీ తరఫున రూ. 50 వేలు, ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు అందజేశాం. ప్రభుత్వం తరఫున ఇంటి నివాస స్థలం పట్టా, అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇప్పిస్తాం అని జిల్లా మంత్రి హామీ ఇచ్చారు. 16. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు అన్నివిధాలా పెద్ద పీట వేసింది. దళిత మహిళను హోం మంత్రిని చేసి.. మరో గిరిజన మహిళను డిప్యూటీ సీఎం చేశారు. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఇది. - ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. దేశ చరిత్రలోనే ఎప్పుడూ, ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలను జగన్ మోహన్ రెడ్డిగారు అందిస్తున్నారు. --------
Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
• Valluru Prasad Kumar
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర కార్తీక మాసంలో వచ్చే పండుగ విశిష్టత
• Valluru Prasad Kumar
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
• Valluru Prasad Kumar
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
• Valluru Prasad Kumar
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn