*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image